విద్యార్థులతో భారీ వాటర్ టిన్స్ మోపిస్తున్న ఏలూరు గవర్నమెంట్ హాస్టల్ ...

విద్యార్థులతో భారీ వాటర్ టిన్స్ మోపిస్తున్న ఏలూరు గవర్నమెంట్ హాస్టల్ ...

21/May/2026 20:49    Share:   

విద్యార్థులతో భారీ వాటర్ టిన్స్ మోపిస్తున్న ఏలూరు ఏలూరు గవర్నమెంట్ హాస్టల్ ...చదువుకొచ్చిన విద్యార్థులతో బలవంతపు పనులు – నర్సింగ్ విద్యార్థినుల ఆవేదన చెబితే పంపించేస్తారేమోనన్న భయం – నిశ్శబ్దంగా పనులు చేస్తున్న విద్యార్థులు నాసిరకం ఆహారం – మరో వేదన 

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
పేదవారైనా, ధనికులైన వారి పిల్లలు ఎంతో తల్లిదండ్రులకు అపురూపం.వారు కష్టపడి చదివి ఉద్యోగం చేసుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో వారి పిల్లలను వారి వద్ద నుండి మరో ప్రాంతానికి పంపించి చదివిస్తున్న తల్లిదండ్రులు ఇలాంటి దృశ్యాలు చూస్తే చలించిపోతారు.ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జిఎన్ఎమ్ నర్సింగ్  చదువుతున్న స్టూడెంట్స్ చేత 20 లీటర్ల వాటర్ టిన్స్ ను పైకి మోపిస్తున్న దృశ్యం. చదువుకోడానికి వచ్చిన విద్యార్థులతో భారమైన పనులు చేస్తున్న వైనం. గత కొంతకాలంగా ఇలాగే పనులు చేస్తున్నారని ఎవరికీ చెప్పలేక చెబితే ఏమైపోతుందో నన్ను పంపించేస్తారేమో అన్న భయంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ అక్కడ ఉన్న వారు చెప్పిన పనులు చేస్తూ వెళుతున్నారు. అక్కడ వారికి పెట్టే ఆహారం కూడా సరిగ్గా ఉండటం లేదని నాసిరకంగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై ఏలూరు జిల్లా కలెక్టర్ దృష్టి సారించి విద్యార్థుల బాధలు అర్థం చేసుకుంటారని వారు కోరుకుంటున్నారు.
Breaking News

Subscribe our Newsletter