పదవ తరగతి (SSC) పరీక్షల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు – జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్. అనకాపల్లి,మార్చి 14,2026: రాబోయే ఎస్.ఎస్.సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు) శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ప్రకటించారు. మొత్తం పరీక్షా కేంద్రాలు: 102.. మొత్తం విద్యార్థులు: 21,017 (బాలురు: 10,673, బాలికలు: 10,344)పరీక్షా సమయం: ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు.విద్యార్థులు ఉదయం 9:00 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.పరీక్ష పూర్తయ్యే వరకు విద్యార్థులను బయటకు పంపడం జరగదు.హాల్ టికెట్ లేనిదే లోపలికి అనుమతి లేదు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్ పరికరాలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను పరీక్షా కేంద్రంలోకి తీసుకురావడం పూర్తిగా నిషిద్ధం.అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కేంద్రాల పరిసరాల్లో ప్రజలు గుమికూడరాదు.పరీక్షా సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ మరియు ఇంటర్నెట్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశాం. చీఫ్ సూపరింటెండెంట్ మినహా మరెవ్వరూ (సిబ్బందితో సహా) పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదు.సమస్యాత్మక మరియు సున్నితమైన కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేశాం.మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడే వారిపై "ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్, 1997" ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.విద్యార్థుల కోసం పరీక్షా కేంద్రాలలో తాగునీటి సౌకర్యం కల్పించడమైంది. అభ్యర్థులు తమ బ్యాగులు మరియు వ్యక్తిగత వస్తువుల భద్రతను స్వయంగా చూసుకోవాలి.