చీపురుపల్లి టీడీపీకి భారీ చేరికలు.కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కళావెంకటరావు..

చీపురుపల్లి టీడీపీకి భారీ చేరికలు.కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కళావెంకటరావు..

07/October/2026 21:56    Share:   

వైఎస్సార్‌సీపీ నుంచి 50 కుటుంబాలు టీడీపీలోకి.. కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కళావెంకటరావు
గరివిడి, అక్టోబర్ 7:

గరివిడి మండలం కొండదాడి పంచాయతీ పరిధిలో వైఎస్సార్‌సీపీకి చెందిన సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.
పచ్చమట్ల సాయిరాజు ఆధ్వర్యంలో భార్నాల నీలకంఠం, మన్నెపూరి రామారావు, కొక్కిరి మోహన్, రేగానా పెద్ద లక్షము, నక్కెల్ల కిష్టమ్మ, లోచర్ల అప్పలనాయుడు తదితరులు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కళావెంకటరావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం కల్పిస్తూ, పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

క్రైమ్ ఎనాలిసిస్ చీపురుపల్లి రిపోర్టర్ ఎస్ ఏ ఎన్ రాజు
Breaking News

Subscribe our Newsletter