విద్యా సంస్థల అక్రమ అడ్మిషన్ల దోపిడీపై AISF నిరసన ...

విద్యా సంస్థల అక్రమ అడ్మిషన్ల దోపిడీపై AISF నిరసన ...

18/April/2026 20:08    Share:   

విద్యా సంస్థల అక్రమ అడ్మిషన్ల దోపిడీపై AISF నిరసన,విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదు! 
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. ఫణీంద్ర కుమార్  
అచ్యుతాపురం:
ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, కనీస అనుమతులు లేకుండా అడ్మిషన్ల పేరిట దోపిడీకి తెగబడుతున్న  కార్పొరేట్ విద్యా సంస్థల తీరును వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) ఆధ్వర్యంలో శనివారం అచ్యుతాపురంలో వద్ద ఉన్న నారాయణ,భాష్యం పాఠశాలల కార్యాలయాల వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. 
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి ఫణీంద్ర  కుమార్ మాట్లాడుతూ నారాయణ భాష్యం విద్యాసంస్థలు ఏటువంటి అనుమతులు లేకపోయినా ఇష్టరాజ్యంగా అడ్మిషన్లు చేస్తూ విద్యార్థులను,విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి వేలకు వేలు ఫీజులను కట్టించుకొని మోసం చేస్తున్నారు. కనీసం పాఠశాల భవనం కూడా లేకపోయినా పాఠశాల నడపడానికి అనుమతులు ఉన్నాయని అబద్ధాలు చెబుతూ ధనర్జనే ధ్యేయంగా ముందుకు పోతున్నాయి. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా ఈ ఫీజుల దోపిడీని అరికట్టాలని,తల్లిదండ్రుల అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని అనుమతి లేకపోయినా అడ్మిషన్ చేస్తున్న నారాయణ భాష్యం విద్యాసంస్థల కార్యాలయాలను సీజ్ చేయాలని చేసిన నిరసనకి స్పందించి ఎంఈఓ గారు కార్యాలయాలు సీజ్ చేశారు. కానీ కేవలం సీజ్ చేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు చేపట్టాలని జిల్లా, మండల విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఎటువంటి ప్రభుత్వ నిబంధన పాటించకుండా పాఠ్యపుస్తకాలు,యూనిఫాం పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకపోయినా పాఠశాలలో అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించిన పాఠశాలలపై తక్షణమే తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేయాలని అన్నారు. లేనిపక్షంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు. 
అదేవిధంగా అచ్యుతాపురం మండల విద్యాశాఖ అధికారి దేవరాయలు గారు స్పందిస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని కచ్చితంగా పాఠశాల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు  జగదీష్,సింహాద్రి, మణికంఠ ,నవీన్, తేజ, పురుషోత్తం, వర్ధన్, రమణ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter