డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పూజలు,
22/April/2026 19:58
Share:
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పూజలు,' యలమంచిలి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బుధవారం స్థానిక గౌడ జోగమాంబ స్మారక వేద పాఠశాలలో ప్రత్యేక ఆధ్యాత్మిక క్రతువులు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజా జీవితంలోకి రావాలని కోరుతూ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రుద్ర హోమం, చండీ పారాయణ, ఆయుష్య హోమం మరియు రుద్రాభిషేకం అత్యంత నిష్ఠతో జరిపించారు. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ కు దైవబలం తోడవాలని, ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఈ పూజలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజా సేవ పట్ల అంకితభావంతో నిరంతరం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే పూర్తి శక్తితో తన బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం కోసం ఆయన నాయకత్వం ఎంతో అవసరమని, భగవంతుని ఆశీస్సులతో ఆయన త్వరగా ప్రజలకు అందుబాటులోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల కోసం పరితపించే నాయకుడికి దైవ రక్షణ ఉండాలని కోరుకుంటూ ఈ హోమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు సోమేశ్వరరావు,అధ్యక్షులు ఆచాళ్ళ. వీర, కొక్కిరాపల్లి పిఎసిఎస్ చైర్మన్ గోపీనాథ్, పట్టణ జనసేన అధ్యక్షులు బొద్ధపు. శ్రీను, రాంబిల్లి మండల జనసేన అధ్యక్షులు నూకన్న దొర,ఊటకూటి. రమేష్ నాయుడు, కొటారి. శ్రీనివాస్, పిట్టా. శ్రీను, సెక్రటరీ పెద్దింటి. సూర్యనారాయణ మూర్తి, రాచకొండ శ్రీను, భాగవతుల. సాయి, ఆనివెళ్ల. శ్రీనివాస్, ఆకొండి. సాయి, కాలనాధభట్ల. వెంకటేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు.