నిబంధనలకు విరుద్ధంగా టోకెన్లు జారీ చేస్తే ఛార్జీ మెమోలు జారీ. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ...
29/April/2026 07:27
Share:
జిల్లాలో వైద్యసేవలు, వ్యవసాయ అనుబంధ శాఖలు, మరియు ఇతర ప్రజోపకార కార్యక్రమాలకు ఇంధన కొరతలేదు.శాఖలు వారీగా కావలసిన ఇంధన కూపన్లు జారీ చెయ్యాలి, నిబంధనలకు విరుద్ధంగా టోకెన్లు జారీ చేస్తే ఛార్జీ మెమోలు జారీ.జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ... కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు, జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలో వ్యవసాయ అనుబంధ శాఖలు, వైద్యసేవలు, ఏపీఎస్ ఆర్టీసీ, తదితర శాఖలు, ఇతర ప్రజోపకార కార్యక్రమాలకు ఇంధన అవసరాలుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. శాఖలు వారీగా ఇంధన అవసరాలను జిల్లా కలెక్టరు సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వైద్యసేవలు, వ్యవసాయఅనుబంధ శాఖలు, మరియు ఇతర ప్రజోపకార కార్యక్రమాలకు ఇంధన కొరతలేదని స్పష్టం చేశారు. శాఖలు వారీగా ముందుగా కావలసిన ఇంధన ఇండెంటును సమర్పించాలని, సరఫరాలో ఎటువంటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు, రైతులకు అందిస్తున్న సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు ఎటువంటి ఇంధన కొరత లేదని, ఏలూరు, నూజివీడు ఏపీఎస్ ఆర్టీసీలో రెండు బంకులు ఉన్నాయని, నాలుగురోజులు వరకు నిల్వలు సరిపోతాయని మరలా ఆయిల్ కొరకు ఇండెంట్లు పెట్టామని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ, వైద్య మరియు అత్యవసర సేవలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అన్నారు. జిల్లాలో ఇంధన నిల్వలకు అన్ని చర్యలుతీసుకుంటున్నామని, అవసరాలు మేరకు సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు. అయితే అవసరాలు తగ్గట్టుగా మాత్రమే ఇంధనాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఇంధనాన్ని నిల్వలు పెట్టుకుంటే రోజువారీ వినియోగదారులకు కొరత ఏర్పడుతుందని, వేసవి దృష్ట్యా ఇంధన నిల్వలు వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలని అన్నారు. ప్రజలు, రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అందరకీ అందేలా ఇంధన పంపిణీకి క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో విద్యత్తు అంతరాయాలు లేకుండా చూడాలని, జనరేటర్లకు, అంబులెన్స్ లకు డీజిల్ కొరత లేకుండా చూడాలని అన్నారు.ప్రతి ప్రభుత్వ అసుపత్రిలో ఒక విద్యుత్తు ఉద్యోగి ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏ ఒక్క రైతు డీజిల్ కొరకు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఐటిడిఏ పరిధిలో, పోలవరంలో ఇంధన కొరత రాకుండా చూడాలని, గృహ నిర్మాణాల్లో ఇంధన కొరత రాకుండా నిర్మాణాలు జరగాలని అన్నారు. నిబంధన మేరకు టోకెన్లు జారీ చెయ్యాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో టోకెన్లు జారీ చేస్తే ఛార్జీ మెమోలు జారీ చెయ్యాలని అన్నారు. పట్టణ, గ్రామాల్లో ఉన్న పెట్రోల్ బంకులు నిల్వలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని, అవసరాలకు తగ్గట్టుగా ఆయిల్ కంపెనీలకు ఇండెంట్లు పెట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పెట్రోల్ బంకులలో టోకెన్లకు మొదట ప్రాధాన్యతను ఇవ్వాలని, మిగతా వారికి నిబంధనలకు అనుగుణంగా ఇంధనాన్ని అందించాలని జిల్లా కలెక్టరు స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఇన్చార్జి జిల్లా రెవిన్యూ అధికారి యల్.దేవకీదేవి, ఇన్చార్జి ఆర్డీవో ఐ.కిశోరు, ఐటిడిఏ పివో కె.రాములు నాయక్, జిల్లా ప్రజా రవాణాధికారి యస్.కె. షబ్నమ్, జెడ్పీ సిఈవో పి.జగదాంబ, ఉప రవాణా కమిషనరు యస్.కె.కరీం, జిల్లా వ్యవసాయ శాఖ జెడి యస్.కె.హబీబ్ భాషా, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజా నాయక్, డీఆర్డిఏ పిడి టి.వి. విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.యు.శోభ, డిసిహెచ్ఎస్ డా.బి.పాల్ సతీష్ కుమార్, జిల్లా గృహనిర్మాణ శాఖ పిడి జి.సత్యనారాయణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. గోవిందరాజులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.