యలమంచిలిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 73 మందికి భారీ జరిమానా, ముగ్గురికి రిమాండ్.
30/March/2026 21:44
Share:
మద్యం సేవించి వాహనాలు నడపకండి..!మీ కుటుంబాలకు రక్షణగా ఉండండి..! క్రైమ్ అనాలసిస్ టివియస్ ప్రకాష్ (సోషల్ మీడియా ఇంచార్జ్), యలమంచిలి : యలమంచిలి ట్రాఫిక్ ఎస్ ఐ రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం, మార్చి నెలలో యలమంచిలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలలో మొత్తం 90 మంది పట్టుబడ్డారు.ఇందులో 76 మందిని కోర్టులో హాజరుపరచగా, వారిలో 73 మందికి ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున మొత్తం ₹7,30,000/- జరిమానా విధించబడింది.అదేవిధంగా ముగ్గురికి 5 రోజుల రిమాండ్ విధించబడింది. ఇంకా 14 మంది కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెచ్చరిక జారీ చేస్తూ — మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ప్రతి బైక్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోవాలని, మీ కుటుంబాలకు రక్షణగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.అలాగే విధుల నిర్వహణలో పోలీసులకు సహకరించాలని ప్రజలకు సూచించారు.