చీపురుపల్లి, అక్టోబర్ 2:
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU)–ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) పిలుపు మేరకు అక్టోబర్ 2న వర్కింగ్ జర్నలిస్టుల కోర్కెల దినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులపై దాడులను అరికట్టి భద్రతా చట్టాన్ని తీసుకురావాలని, జర్నలిస్టుల హక్కులకు చట్టబద్ధ రక్షణ కల్పించాలని కోరారు. మీడియా కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా నూతన వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.విధి నిర్వహణలో ప్రమాదాలకు గురయ్యే జర్నలిస్టుల కుటుంబాలకు భరోసా కల్పించేలా బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, జర్నలిస్టులకు నగదు రహిత వైద్య సేవలు అందించాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, సీనియర్ జర్నలిస్టులకు పింఛను సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.వార్తా సేకరణ కోసం దేశవ్యాప్తంగా ప్రయాణించే జర్నలిస్టులకు రైల్వే రాయితీని పునరుద్ధరించాలని, పత్రికా స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలపై హామీలకే పరిమితం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని IJU–APUWJ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Crime Analysis, Cheepurupalli Reporter S. A. N. Raju