ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా ఎలమంచిలి టౌన్‌లో డ్రగ్ టెస్టులు..
16/October/2026 07:56
Share:
ఎలమంచిలి టౌన్, అనకాపల్లి జిల్లా
ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా ఎలమంచిలి టౌన్‌లో ఆకస్మిక డ్రగ్ టెస్టింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఎలమంచిలి టౌన్ ఎస్‌ఐ వారి సిబ్బంది మరియు EAGLE ఇన్‌స్పెక్టర్ శ్రీ S. నారాయణరావు,సిబ్బందితో కలిసి పట్టణంలోని లాడ్జిలు, డ్రగ్స్ వినియోగానికి అనుమానాస్పదంగా గుర్తించిన హాట్‌స్పాట్‌ల వద్ద తనిఖీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో Bio-Check డ్రగ్ టెస్ట్ కిట్‌ల ద్వారా 10 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఈ సందర్భంగా ఎలమంచిలి టౌన్ ఎస్‌ఐ గారు మాట్లాడుతూ, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్ టెస్టుల ద్వారా మాదకద్రవ్యాల వినియోగాన్ని త్వరితగతిన గుర్తించే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చిన వ్యక్తుల విషయంలో చట్ట నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైన వారికి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స, కౌన్సెలింగ్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పదేపదే మాదకద్రవ్యాలను వినియోగించే వ్యక్తుల విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ఈ డ్రగ్ టెస్టింగ్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ముఖ్యంగా యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ విలువైన భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసినవారు EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972 కు తెలియజేయాలని సూచించారు.