రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన అనకాపల్లి రూరల్ పోలీసులు

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన అనకాపల్లి రూరల్ పోలీసులు

06/June/2026 20:45    Share:   

అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తూహిన్ సిన్హా, IPS గారి ఆదేశాల మేరకు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు నేరస్తులలో ప్రవర్తనా మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రతి శనివారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి రూరల్ పోలీసులు తమ సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. వారి ప్రస్తుత కార్యకలాపాలు, ప్రవర్తన, జీవన విధానంపై సమీక్ష నిర్వహించి భవిష్యత్తులో ఎటువంటి నేర కార్యకలాపాలకు పాల్పడకుండా చట్టాన్ని గౌరవిస్తూ సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు.
ఈ సందర్భంగా అనకాపల్లి రూరల్ CI గారు మరియు SI గారు మాట్లాడుతూ, రౌడీ షీటర్లు తమ పాత అలవాట్లను విడనాడి సత్ప్రవర్తనతో జీవించాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలు, గొడవలు, బెదిరింపులు, అక్రమ వసూళ్లు, భూ వివాదాలు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. ఎవరైనా మళ్లీ నేరాలకు పాల్పడినట్లయితే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నిరంతర నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు.
అదేవిధంగా కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించారు. నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు రౌడీ షీటర్లలో సానుకూల మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.పదే పదే నేరాలకి పాల్పడిన, గోడవలకి, దౌర్జన్యాలకి పాల్పడిన వారి పైన పీడీ యాక్ట్ పెట్టడమే కాకుండా వారిని జిల్లా బహిస్కరణ కు చర్యలు చేపడతామని హెచ్చరించారు. 
Breaking News

Subscribe our Newsletter