మంత్రి పి. నారాయణకు నివేదిక సమర్పించిన ప్రజా నాయకుడు మజ్జి రామకృష్ణ..!!
06/March/2026 11:26
Share:
క్రైమ్ అనాల్సిస్ (టివియస్ ప్రకాష్) యలమంచిలి:
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు అభివృద్ధి పనులపై పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ ను 23వ వార్డు కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధిలో వెనుకబడిన 23వ వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రకటించిన నిధులపై మంత్రి తో చర్చించినట్లు మజ్జి రామకృష్ణ తెలిపారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ నెలలో తొలి విడతగా ₹50 లక్షలు విడుదల చేసి, పనులు పూర్తి అయిన తర్వాత రెండవ విడతగా మరో ₹50 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారని, దేవుడు వరమిచ్చినా పూజరులు వరమైవ్వటలేదని..!! ఈ విషయం మంత్రి వారి దృష్టికి తీసుకెళ్లనానని, ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా 23వ వార్డు ప్రజల తరఫున మంత్రి పి. నారాయణకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ పేర్కొన్నారు.