పురుషోత్తపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య సమావేశం
22/March/2026 20:19
Share:
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ (సోషల్ మీడియా ఇంచార్జ్ ) యలమంచిలి : అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు యలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే విధంగా జరగనున్నదని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల పరిశీలకులు కొమ్ముల తిరుపతి కుమార్, మండల అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శులు కితంశెట్టి సన్యాసినాయుడు, గంజి శ్రీనివాసరావు, పిఎసిఎస్ చైర్మన్ కొలుకులురు విజయరామరాజు, టివియస్ ప్రకాష్, రాజాన నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.