రాంబిల్లి గూగుల్ నిర్వాసి రైతులకు ఉపాధి కల్పించాలి..!"

రాంబిల్లి గూగుల్ నిర్వాసి రైతులకు ఉపాధి కల్పించాలి..!"

22/May/2026 19:28    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - ఉత్తరాంద్ర జోనల్  ఇంచార్జ్ :
రాంబిల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ కారణంగా భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులు, స్థానిక ప్రజలు శుక్రవారం నిర్మాణ స్థలం వద్ద ఆందోళన చేపట్టారు. తమ భూములు తీసుకుని జీవనోపాధిని దూరం చేసి, స్థానికులకు ఉపాధి కల్పించకపోతే ఎలా జీవించాలంటూ రాంబిల్లి, కొండల దేవుని పాలెం, కొండవారపాలెం గ్రామాల భూ నిర్వాసితులు నిరసన వ్యక్తం చేశారు.ఈ ఆందోళనకు సీపీఎం మండల కార్యదర్శి జి దేవుడు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పిన్నమరాజు కిషోర్ రాజు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో రైతుల భూములు తీసుకుని, నిర్మాణ పనుల్లో కూడా స్థానికులకు ఉపాధి ఇవ్వకపోతే భూములు కోల్పోయిన రైతులు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు.సుమారు 170 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ వల్ల కొబ్బరి, తాటి, ఈత చెట్లపై ఆధారపడి జీవించే కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. కొబ్బరి బొండాలు దించడం, చీపురు పనులు చేయడం, కూలి పనులు, పశుపోషణ, పాడి పరిశ్రమలపై ఆధారపడిన అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత గూగుల్ యాజమాన్యం మరియు ప్రభుత్వంపై ఉందన్నారు.సమాచారం అందుకున్న స్థానిక సీఐ సిహెచ్ నర్సింగరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని నిర్వాసిత పెద్దలను ఒకచోట చేర్చి చర్చలు జరిపారు. అనంతరం ఎమ్మార్వో, పోలీసు అధికారులు నిర్వాసితులతో సమావేశమై స్థానికులకు నిర్మాణ పనుల్లో ఉపాధి కల్పించడం, చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు ఇవ్వడం, పెండింగ్‌లో ఉన్న చెట్ల నష్టపరిహారం, బోర్‌వెల్లు, నుయ్యలకు సంబంధించిన పరిహారం త్వరలో చెల్లించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.అధికారుల హామీతో స్థానికులు తమ ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో నిర్వాసిత రైతులు, మహిళలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter