జంపపాలెం స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ప్రధమ బహుమతి 8,000/-

జంపపాలెం స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ప్రధమ బహుమతి 8,000/-

23/February/2026 07:36    Share:   

యలమంచిలి మండలంలోని ములకలాపల్లి గ్రామంలో గల మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సిమెంట్ ఫ్యాక్టరీ) సి.ఎస్.ఆర్ నిధులతో యలమంచిలి మండలం పరిధిలో  ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్ధిని విద్యార్ధులకు, అలాగే 8, 9 తరగతులలో ప్రతిభ చూపిన వారికి ఏటికొప్పాక, పులపర్తి, పురుషోత్తపురం, రేగుపాలెం, యలమంచిలి గర్ల్స్ హైస్కూల్, స్టేషన్ రోడ్ స్కూల్, గవర్నమెంట్ హైస్కూల్, కొత్తపేట స్కూల్, సోమలింగపాలెం, జంపపాలెం స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ప్రధమ బహుమతి 8,000/-, ద్వితీయ బహుమతి 6,000/-, తృతీయ బహుమతిగా 4,000/- చప్పున 10 స్కూల్స్ కి రూ 1,80,000/-  చెక్కులు, ప్రశంస పత్రాలు అందజేయడం జరిగినదని ఫ్యాక్టరీ యూనిట్ హెడ్ బి.రామస్వామి తెలిపారు. ఈ  కార్యక్రమంలో సీనియర్ డి.జి.ఎమ్ (పి.అండ్.ఎ) ఎల్. శ్రీనివాసరావు, సి.ఎస్.ఓ డి. వెంకటరావు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter