ప్రభుత్వ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు.200 కోట్ల ఆస్తుల గుర్తింపు!

ప్రభుత్వ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు.200 కోట్ల ఆస్తుల గుర్తింపు!

16/June/2026 22:04    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
హైదరాబాద్: ల్యాండ్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల సందర్భంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు సమాచారం.
ఇంట్లో సంచుల్లో నింపి అటకపై దాచిన రూ.1.2 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకోగా, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు కూడా బయటపడ్డాయి. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
అధికారులు త్వరలో బ్యాంక్ లాకర్లను తెరిపించి తనిఖీలు చేపట్టనుండగా, మొత్తం ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
"అటకపై నోట్ల కట్టలు.. ప్రభుత్వ అధికారి ఇంట్లో ఏసీబీకి షాక్!" అంటూ ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Breaking News

Subscribe our Newsletter