ఈ నెల 16న ఇండోర్ స్టేడియంలో హాజరయ్యే 5 వేల మంది రైతులు, మహిళలు, ప్రజలకు అన్ని వసతులు కల్పించాలి.

ఈ నెల 16న ఇండోర్ స్టేడియంలో హాజరయ్యే 5 వేల మంది రైతులు, మహిళలు, ప్రజలకు అన్ని వసతులు కల్పించాలి.

12/June/2026 20:05    Share:   

#రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” జిల్లా స్థాయీ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి.
#శాఖలు వారీగా అభివృద్ధి, సంక్షేమం మరియు విజయ గాధలు నివేదికలు సిద్ధం చేసుకోవాలి.
#ప్రతి పథకానికి ఏడు నియోజకవర్గాలు నుండి ఏడు మంది లబ్ధిదారులను విజయగాధగా బాగా మాట్లాడేవారిని  ఎంపిక  చెయ్యాలి.
#ఈ నెల 16వ తేదీ ఇండోర్ స్టేడియంలో 5 వేలు మంది  హాజరు అయ్యే రైతులకు, లబ్ధిదారులకు, మహిళలకు, ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించాలి. 
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ...
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం "రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం”జిల్లా స్థాయీ  కార్యక్రమం విజయవంతంపై" జిల్లా అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ పాల్గొన్నారు."రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం” జిల్లా స్థాయి కార్యక్రమంపై శాఖలు వారీగా సమీక్షించి, జిల్లా కలెక్టరు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చెయ్యాలని అన్నారు. జిల్లా ఇంచార్జి మంత్రి, జిల్లా మంత్రి, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, తదితర ప్రజా ప్రతి నిధులకు ముందుగా ఆహ్వాన పత్రికలను అందించాలని అన్నారు. శాఖలువారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, విజయగాధలు పూర్తిస్థాయి నివేదికలు ఈ సాయంత్రానికి అందజేయ్యాలని అన్నారు. ప్రతి పథకానికి ఏడు నియోజకవర్గాలు నుండి ఏడుమంది లబ్ధిదారులను విజయగాధగా బాగామాట్లాడే వారిని  ఎంపిక చెయ్యాలని అన్నారు. ఈ నెల 16వ తేదీన జిల్జా కలెక్టరేటు ఆపోజిట్ ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి 5 వేలు మంది  హాజరు అయ్యే రైతులు, లబ్ధిదారులకు, మహిళలకు, ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించాలని  ఆదేశించారు. ఈనెల 16వ తేదీన జరగవలసిన జిల్లా స్థాయీ యోగాంధ్రను 17వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన  ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు, ఆర్&ఆర్ ప్యాకేజీ లబ్ధిదారులు, తల్లికివందనం, స్త్రీశక్తి పథకం, అన్నాక్యాంటీన్లు, పీ4 బంగారు కుటుంబాలు, అన్నదాత సుఖీభవ, సూర్యఘర్, ఉచిత గ్యాసు మూడు సిలిండర్లు పంపిణీ, తదితర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సమగ్రంగా వివరించేలా కార్యక్రమాన్ని  డిజైన్ చెయ్యాలని  అన్నారు. కార్యక్రమ వేదిక, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు భాగస్వామ్యం, శాఖలు వారీగా ప్రదర్శనలు, ప్రచార ఏర్పాట్లు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్తు, పార్కింగు ప్లేస్, తదితర అంశాలుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. చల్లటి త్రాగునీరు, అల్పాహారం, భోజన వసతి ఏర్పాట్లు పక్కగా ఉండాలని అన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలు సంబంధించి పూర్తిస్థాయిలో ఏడుస్టాల్స్ ను ఏర్పాటుచెయ్యాలని ఆదేశించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నిఏర్పాట్లు ముందుగానే పూర్తి చెయ్యాలని సూచించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ద్వారా లబ్ధిపొందిన వారి అనుభవాలను ప్రజలకు తెలియ జేసే విధంగా కార్యక్రమాన్ని చక్కని రూపకల్పన చెయ్యాలని తెలిపారు. సంబంధిత శాఖలు తమ శాఖలు విజయాలు, పురోగతి వివరాలను సిద్ధం చెయ్యాలని  సూచించారు. కార్యక్రమ నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లా స్థాయిలో విజయవంతం చెయ్యాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో  ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎల్. దేవకీదేవి, జిల్లా పరిషత్తు సిఇవో పి.జగదాంబ, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, వివిధ శాఖలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter