APPSC Group-2 రాష్ట్ర స్థాయి మెగా టెస్ట్ – 2026 విజయవంతం..!!

APPSC Group-2 రాష్ట్ర స్థాయి మెగా టెస్ట్ – 2026 విజయవంతం..!!

01/May/2026 14:28    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - యలమంచిలి :

SGA Government Degree College (Autonomous), యలమంచిలి లోని కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో కన్వీనర్ అర్జున అప్పారావు సమన్వయంతో నిర్వహించిన APPSC Group-2 రాష్ట్ర స్థాయి మెగా టెస్ట్ – 2026 విజయవంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఈ మెగా టెస్ట్‌కు విశేష స్పందన లభించింది. ఆఫ్‌లైన్ విధానంలో 250 మంది విద్యార్థులు, ఆన్‌లైన్ ద్వారా సుమారు 2000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు, ఎమ్మెల్సీ డాక్టర్ చిరంజీవి ఆన్‌లైన్ ద్వారా పాల్గొని విద్యార్థులకు పోటీ పరీక్షల ప్రిపరేషన్‌కు సంబంధించిన కీలక సూచనలు అందించారు. లక్ష్య నిర్ధారణ, క్రమబద్ధమైన ప్రణాళిక, ప్రాక్టీస్ టెస్టుల ప్రాముఖ్యత, సమయ నిర్వహణ వంటి అంశాలపై ఆయన మార్గదర్శనం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఇలాంటి మెగా టెస్టులు విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకునేందుకు మంచి వేదికగా ఉపయోగపడతాయని తెలిపారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే నిరంతర అభ్యాసం, క్రమశిక్షణ, సమయ నిర్వహణ అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల ప్రయోజనార్థం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడించారు.ఈ పరీక్ష పూర్తిగా APPSC Group-2 ప్రిలిమినరీ సిలబస్‌కు అనుగుణంగా రూపొందించబడింది. ప్రతి ప్రశ్నకు వివరణాత్మక సమాధానాలు ఇవ్వడం వల్ల విద్యార్థుల ప్రిపరేషన్‌కు మరింత తోడ్పాటునిచ్చింది.ఈ మెగా టెస్ట్ ద్వారా విద్యార్థులు తమ బలహీన అంశాలను గుర్తించుకోవడంతో పాటు రాష్ట్ర స్థాయి పోటీ వాతావరణాన్ని అనుభవించే అవకాశం పొందారు.కెరీర్ గైడెన్స్ సెల్ తరఫున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ప్రిన్సిపాల్, SGA ప్రభుత్వ డిగ్రీ కళాశాల (A), యలమంచిలి
Breaking News

Subscribe our Newsletter