రాష్ట్ర 6వ మున్సిపల్ ఫెడరేషన్ మహాసభలను జయప్రదం చేయండి   - ఏఐటీయూసీ

రాష్ట్ర 6వ మున్సిపల్ ఫెడరేషన్ మహాసభలను జయప్రదం చేయండి - ఏఐటీయూసీ

01/March/2026 07:23    Share:   

యలమంచిలి : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని జిల్లా మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గని శెట్టి ఏసుదాస్ అన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ శానిటేషన్ గ్యారేజీ వద్ద యలమంచిలి మున్సిపల్ కార్మికులతో ఆరవ రాష్ట్ర మున్సిపల్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసుదాసు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులను అందర్నీ పర్మినెంట్ చేయాలని కనీస వేతనాలు పెంచాలని 12వ పియర్స్ నీ వెంటనే అమలు చేయాలని అన్నారు. తదితర రాష్ట్రవ్యాప్త మున్సిపల్ సమస్యలపై రాజమండ్రిలో జరిగే ఆరవ రాష్ట్ర మున్సిపల్ ఫెడరేషన్ మార్చి 16, 17, 18 తేదీల్లో జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగ కార్మికులు ప్రతినిధులు హాజరవుతారని వివిధ కార్మిక సంఘాల నాయకులు కూడా హాజరవుతారని అన్నారు. ఈ మహాసభల్లో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఈ మహాసభలను కార్మికులందరూ హాజరై జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో వై నూకరాజు, సిహెచ్ వెంకటరమణ, డి మహేష్, ఈ చందర్రావు, డి ఆది మూర్తి, ఎం నాగరాజు, భాస్కర్ రావు, వై దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter