కరాటే చాంపియన్‌షిప్‌లో ఎలమంచిలి విద్యార్థుల ప్రభంజనం.. పతకాల పంట
04/February/2026 09:40
Share:
కరాటే చాంపియన్‌షిప్‌లో ఎలమంచిలి విద్యార్థుల ప్రభంజనం.. పతకాల పంట
విశాఖపట్నంలో జరిగిన జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌షిప్‌లో ఎలమంచిలి బ్రాంచ్‌కు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. సౌత్ ఇండియా మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 25 మంది విద్యార్థులు స్వర్ణ పతకాలు, 20 మంది విద్యార్థులు కాంస్య పతకాలు సాధించారు. ఈ విద్యార్థులను మాస్టర్ నక్క వెంకటరమణ శిక్షణ ఇచ్చారు.