యలమంచిలి శ్రీ చైతన్య పాఠశాలలో జాతీయ సైన్స్ ఫెయిర్ దినోత్సవం
01/March/2026 07:18
Share:
యలమంచిలి : పట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో "జాతీయ సైన్స్ దినోత్సవం" సందర్భంగా "విద్యా వైజ్ఞానిక ప్రదర్శన" (సైన్స్ ఫెయిర్) ఆద్యంతము ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ఎం.ఈ.ఓ మూర్తి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం ఈ జాతీయ సైన్స్ దినోత్సవం ప్రధాన ఉద్దేశం అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు 400కు పైగా వివిధ వైజ్ఞానిక నమూనాలను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల రీజినల్ ఇంచార్జి, ఏసిఓ పట్నాయక్, పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర రావు, డీన్ దత్తు, అసిస్టెంట్ డీన్ శ్రీనివాసరావు, సి బ్యాచ్ ఇంచార్జ్ లోవే శ్వరరావు, ప్రైమరీ ఇంచార్జ్ శ్రీలక్ష్మి, ప్రీ ప్రైమరీ ఇంచార్జి భవాని, సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అత్యంత ప్రతిభ విద్యార్థుల నమూనాలకు బహుమతులు ప్రధానం చేశారు.