విద్యార్థులు ప్రపంచ స్థాయి ప్రతిభ కనబరచాలి. డైట్ లో కంప్యూటింగ్ టెక్నాలజీ జాతీయ సదస్సు ప్రారంభం అనకాపల్లి దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ , ఆటానమస్, ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రొఫెషనల్ బాడీ ఆధ్వర్యంలో “కంప్యూటింగ్ టెక్నాలజీ ధోరణులపై జాతీయ సదస్సు (ఎన్సీటీసీటీ–2కె26)” ఘనంగా ప్రారంభించబడింది . ఈ సదస్సులో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు మరియు ఇంజినీరింగ్ కళాశాలల నుండి అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎస్ఐ విశాఖపట్నం చాప్టర్ ట్రెజరర్ మరియు ఐఆర్ & ఈఆర్పీ విభాగం సీనియర్ మేనేజర్ శ్రీ సి. ఉదయ్ కుమార్ గారు హాజరయ్యి విద్యార్థులుకు కంప్యూటింగ్ రంగంలో వేగంగా మారుతున్న సాంకేతిక ధోరణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల ప్రాధాన్యతను వివరించారు. భవిష్యత్తులో పరిశోధన మరియు ఆవిష్కరణల ద్వారా విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆయన ఆకాంక్షించారు. అదే సందర్భంగా ఐఎస్బీఎన్: 978-93-5619-794-7 గల “జెనరేటివ్ ఏఐ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ కోడ్ జనరేషన్” అనే పుస్తకాన్ని శ్రీ సి. ఉదయ్ కుమార్ గారు ఆవిష్కరించారు. ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి తాజా సాంకేతిక రంగాలపై పత్రాల ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించి సదస్సును విజయవంతం చేశారు. కళాశాల చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ ఇటువంటి జాతీయ సదస్సులు విద్యార్థులలో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆర్. వైకుంటరావు గారు తన ప్రసంగంలో ఇటువంటి జాతీయ సదస్సులు విద్యార్థులలో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడమే కాకుండా అకాడమిక్ రంగం మరియు పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా వ్యవహరించిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డా. కె. సుజాత గారు, సదస్సు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ముఖ్య అతిథులు, అధ్యాపకులు మరియు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.