
అనకాపల్లి (జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ) జనవరి 24: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శాప్ లీగ్ సైక్లింగ్ సెలెక్షన్ ను అనకాపల్లి సుంకరమెట్టు నుండి దేవిపురం మీదుగా, 18 సంవత్సరాలు (వ్యక్తిగత, మాస్టర్) విభాగము లో విజయవంతం గా నిర్వహించడం జరిగింది అని, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి శ్రీమతి పూజారి శైలజ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో బాల బాలికలు ఎక్కువ మంది పాల్గొన్నారు. బాలురు అండర్ -18 లో 45 మంది , బాలికలు అండర్ -18 లో 10 మంది చొప్పున పాల్గొన్నారు. ఇందులో గెలుపొందిన విజేతలు ఎన్.టీ.ఆర్ జిల్లాలో లో జరిగే రాష్ట్ర స్థాయి షోటీలలో 28.02.2026 & 01.03.2026 తేదీలలో జరుగు శాప్ లీగ్ సైక్లింగ్ స్టేట్ టోర్మెంట్ లో పాల్గొంటారు. ఇన్-ఛార్జ్ శ్రీ క్ త్రిమూర్తులు, DSA కోచ్, SGF సెక్రటరీ శ్రీ క్.ఎం.ఎల్ నాయుడు గారు మరియు ఇతర PET లు, శావ కోచ్ లు మరియు స్టాఫ్ పాల్గొన్నారు.