దాడి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ - అటానమస్, ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో భారతదేశ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సామాజిక న్యాయ పోరాట యోధుడు అయిన బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి 5-4-26 సందర్భంగా ఇనిస్టిట్యూట్లో ఈరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ గారు ముందుగా బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గారు దేశానికి చేసిన సేవలు, ముఖ్యంగా దళితుల సాధికారత, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. ఆయన జీవిత విశేషాలు, నాయకత్వ లక్షణాలు, దేశ నిర్మాణంలో ఆయన పాత్ర విద్యార్థులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠ రావు గారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ అంటరానితనాన్ని, , సమానత్వాన్ని, మరియు సామాజిక న్యాయాన్ని గురించి పోరాడారు. ఆయన ఇండోపాక్ వార్ 1971 సంవత్సరంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే వ్యవసాయక మంత్రి మరియు కార్మిక శాఖ మంత్రిగా కూడా ఎన్నో సేవలు భారతదేశానికి అందించారని తెలియజేశారు. తదుపరి మొదటి సంవత్సరం చదువుతున్న బీటెక్ విద్యార్థులు బాబు జగజీవన్ రామ్ జీవిత చరిత్ర గురించి ఆయన దేశానికి చేసిన సేవలు గురించి, ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా మరియు మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన పోషించిన కీలక పాత్ర గురించి వివరించారు. చివరిగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని, సమానత్వం మరియు సేవా భావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ఏ కిరణ్ కుమార్ ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ సభ్యులు మరియు విద్యార్థులు కీలక పాత్ర పోషించారు.