డైట్లో ఎన్సీటీసీటీ–2కే26 సదస్సు ప్రొసీడింగ్స్ విడుదల
13/March/2026 16:53
Share:
Date:13-3-2026 అనకాపల్లి దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన “కంప్యూటింగ్ టెక్నాలజీ ధోరణులపై జాతీయ సదస్సు – ఎన్సీటీసీటీ 2కే26” సందర్భంగా సదస్సుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ గ్రంథాన్ని ఘనంగా విడుదల చేశారు. ఈ గ్రంథానికి ఐఎస్బీఎన్ నంబర్: 978-93-5773-574-2 కేటాయించబడింది. దేశంలోని వివిధ విద్యాసంస్థల నుండి వచ్చిన పరిశోధకులు సమర్పించిన పరిశోధన పత్రాలను ఈ ప్రొసీడింగ్స్ గ్రంథంలో సమగ్రంగా ప్రచురించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక కంప్యూటింగ్ సాంకేతికతలకు సంబంధించిన పరిశోధన అంశాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థలో ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ విభాగాధిపతి డాక్టర్ రామరాజు పూసపాటి గారు,డెల్టా మార్చ్ టెక్నాలజీస్ సంస్థలో చీఫ్ స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శ్రీ చంద్ర ఎస్ దసక గారు పాల్గొని ప్రొసీడింగ్స్ గ్రంథాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కంప్యూటింగ్ రంగంలో జరుగుతున్న తాజా సాంకేతిక పరిణామాలను విద్యార్థులు, పరిశోధకులు సృజనాత్మకంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇటువంటి జాతీయ సదస్సులు విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథాన్నిపెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ గారు,కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.వైకుంఠ రావు గారు పాల్గొని నిర్వాహకులను అభినందించారు.సదస్సు కన్వీనర్ డాక్టర్ కె.సుజాత గారు కార్యక్రమాన్ని సమన్వయం చేయగా,అధ్యాపకులు,పరిశోధకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.