పదవ తరగతి విద్యార్థులకు ఎక్స్ట్రా క్లాసులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు అభినందనలు

పదవ తరగతి విద్యార్థులకు ఎక్స్ట్రా క్లాసులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు అభినందనలు

24/February/2026 19:30    Share:   

పదవ తరగతి విద్యార్థులకు ఎక్స్ట్రా క్లాసులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు అభినందనలు -యూనిట్ ఇంచార్జి  -అందుకూరి ప్రసాద్ 
రాంబిల్లి మండలం మూలజంప గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు బాల ప్రభావతి గారి ఆధ్వర్యంలో హిందీ ఉపాధ్యాలు రమణారావు గారు  పదవ తరగతి విద్యార్థులకు ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు రెండు గంటల ప్రత్యేక బోధనా తరగతులు నిర్వహించడం అభినందనీయమని, యూనిట్ ఇంచార్జి అందుకూరి ప్రసాద్ గారు అభినందనలు తెలియజేసారు
పాఠశాల ముగిసిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులు క్లాసులు నిర్వహించడం చాలా గొప్ప విషయమని విద్యార్థుల పట్ల మీకు ఉన్న శ్రద్ధ వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ఉత్తీర్ణత శాతం పెంచడానికి మీరు చేస్తున్న కృషి మా పాఠశాల ప్రతిష్టను మరింత పెంచుతుందని అన్నారు విద్యార్థుల విజయమే నిజమైన ఉపాధ్యాయుల విజయం అని నమ్మి మీరు చేస్తున్న ఈ సేవ సమాజానికి ఆదర్శం మీలాంటి ఉపాధ్యాయులు ఉంటే ఎలాంటి ప్రైవేటు పాఠశాలలు నై నా  ఎదుర్కొని ప్రభుత్వ పాఠశాలు దీటుగా ముందుకు  కొనసాగుతాయని ఆశిస్తున్నాం అని అన్నారు  మీరు చేసే ఈ సేవకు మనస్ఫూర్తిగా మా తరఫున మా గ్రామం తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం అన్నారు 
Breaking News

Subscribe our Newsletter