యలమంచిలి ఎస్ జి ఏ అటానమస్ డిగ్రీ కాలేజీ ఫోర్త్ సెమిస్టర్ డిగ్రీ ఫలితాలు విడుదల
06/May/2026 15:47
Share:
యలమంచిలి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్థానిక గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్ )డిగ్రీ నాలుగవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ.చంద్రశేఖర్ విడుదల చేశారు. కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎం. కిశోర్ వివరించిన వివరాల ప్రకారం మొత్తం 266 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వీరిలో 203 మంది ఉత్తీర్ణులైనారు. వీరిలో బి.ఏ.ఆనర్స్ 93.75%, బీ.కాం ఆనర్స్ 75.90% ,బీఎస్సీ ఆనర్స్ 72.85% కలిపి మొత్తంగా 76.32.% మంది ఉత్తీర్ణులైనట్టుగా తెలిపారు.వివిధ గ్రూపులలో అత్యధిక మార్కులు సాధించిన వారి లో కరణం బాల శ్యామల కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని 9. 65 గ్రేడ్ పాయింట్స్ తో కళాశాలలో సర్వ ప్రథములుగా నిలిచారు.తదుపరి జువాలజీ విద్యార్థిని గొంతిన శ్రీలక్ష్మి 9.27 ,కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని ముప్పిన మాధవి 9.23,గ్రేడ్ పాయింట్స్ తో ద్వితీయ తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పరీక్షలను చక్కగా నిర్వహించి ఫలితాలను వేగంగా విడుదల చేసినందుకు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారి ఎం. కిశోర్ , సహాయకులు పి.విశ్వేశ్వరరావు, కె.ధనలక్ష్మి లను అభినందించారు. అలాగే చక్కని గ్రేడ్ పాయింట్స్ సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.