ఈ.సి.ఈ డిపార్ట్మెంట్ డే సందర్బంగా దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రాజెక్టులను ప్రదర్సన

ఈ.సి.ఈ డిపార్ట్మెంట్ డే సందర్బంగా దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రాజెక్టులను ప్రదర్సన

02/March/2026 17:39    Share:   

దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో  "ఐఈటిఈ ప్రొఫెషనల్  బాడీ" సహకారంతో "ఈ.సి.ఈ డిపార్ట్మెంట్ డే" వేడుకలు ఘనంగా  జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్ ఎస్ టి ఎల్ విశాఖపట్నం,  సైంటిస్ట్-ఈ శ్రీ  చల్లం నాయుడు విచ్చేశారు. ఆయన విద్యార్థులకు, అధ్యాపకులకు " ఏఐ బేస్డ్ అడ్వాన్స్డ్  సిగ్నల్ ప్రోససింగ్ " పై గెస్ట్లెక్చర్ ని అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు వారు తయారుచేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. డిపార్ట్మెంట్  డే వేడుకలు సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులకు పోస్టర్, పి.పి.టి, టెక్నికల్ క్విజ్, లక్కీ డిప్ పోటీలను నిర్వహించారు. "2 వ నేషనల్ కాన్ఫిరెన్స్" పోటీలలో విద్యార్థులు తమ తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా విభాగాధిపతి డాక్టర్ పి పూర్ణప్రియ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కళాశాలలో డిపార్ట్మెంట్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter