క్రైమ్ అనాల్సిస్ - టివియస్ ప్రకాష్ యలమంచిలి : మూలజంప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 18 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 17 మంది ఉత్తీర్ణత సాధించి 99 శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేసి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు.ఈ ఫలితాల్లో పక్కుర్తి లావణ్య 550 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, ఎస్‌కే అబ్దుల్ గఫూర్ 539 మార్కులతో ద్వితీయ స్థానం పొందారు.విద్యార్థుల విజయానికి కృషి చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల సరస్వతి గారికి, ఉపాధ్యాయ బృందానికి స్థానికులు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ విజయానికి కారణమైన ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అందుకూరి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని ఈ విజయంతో నిరూపించారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.