అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మరియు ప్రముఖులు

అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మరియు ప్రముఖులు

11/April/2026 06:33    Share:   

అనకాపల్లి:
స్థానిక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారిని శనివారం దేవాదాయ శాఖ స్టేట్ కమిషనర్, విశాఖ సమాచార్ ప్రతినిధి కే. రామచంద్రరావు, మోహన్ దంపతులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ (DC), అసిస్టెంట్ కమిషనర్ (AC), ఆలయ ఈవో మరియు చైర్మన్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది వారికి అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే రామకృష్ణ, జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ రామ్ తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
క్రైమ్ ఎనాలిసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్.
Breaking News

Subscribe our Newsletter