ఢిల్లీలో హైడ్రామా: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్!

ఢిల్లీలో హైడ్రామా: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్!

21/July/2026 21:21    Share:   

న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద విపక్ష నేతలు, భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. ప్రధాని నివాసం ముట్టడికి యత్నించిన క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ, ఇతర విపక్ష ఎంపీలు రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే, సంజయ్ రౌత్ సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తరలించారు.ప్రభుత్వ విధానాలు, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా 'భారత్' (INDIA) కూటమి ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టింది.
Breaking News

Subscribe our Newsletter