ఇద్దరు బైక్ రైడర్స్ కి జరిమానా

ఇద్దరు బైక్ రైడర్స్ కి జరిమానా

28/February/2026 07:06    Share:   

యలమంచిలి: పట్నంలోని ఇంటర్ పరీక్ష కేంద్రం వద్ద ఓవర్ స్పీడ్తో హల్చల్ చేస్తున్న ఇద్దరు బైక్ రైడర్స్ పై శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. వారిని సీఐ ధనుంజయరావు వద్దకు తీసుకురాగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే ఒక్కొక్కరికి రూ.5,035 చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రోడ్ భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే ప్రమాదాలకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ కే సావిత్రి, రూరల్ ఎస్ఐ ఉపేంద్ర, ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter