హాకీ విజేతలకు యలమంచిలిలో ఘన స్వాగతం..!!

హాకీ విజేతలకు యలమంచిలిలో ఘన స్వాగతం..!!

17/June/2026 21:03    Share:   

 
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీల్లో విజేతగా నిలిచిన అనకాపల్లి జిల్లా హాకీ జట్టుకు యలమంచిలిలో ఘన స్వాగతం లభించింది.
టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి ఛాంపియన్‌గా నిలిచిన జట్టు, విజయ కప్పుతో యలమంచిలి రైల్వే స్టేషన్‌కు చేరుకోగా పట్టణ ప్రజలు, క్రీడాభిమానులు, హాకీ ప్రేమికులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ మాస్టర్ అశోక్ విజేతలకు పుష్పగుచ్ఛాలు అందజేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా రాత్రింబవళ్లు కష్టపడి శిక్షణ తీసుకుని, పట్టుదలతో పోటీల్లో పాల్గొనడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈ గెలుపు అనకాపల్లి జిల్లా హాకీ భవిష్యత్తుకు కొత్త ఊపునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జట్టుకు అన్ని విధాలుగా అండగా నిలిచి విజయానికి మార్గదర్శకుడైన కోచ్ రాంబాబును పట్టణ ప్రముఖులు, క్రీడాభిమానులు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కోటారు నరేష్, గిన్నె వరహాల రెడ్డి, దాసరి మహేష్, బొద్దపు సత్యనారాయణ, సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
"పట్టుదలతో సాధించిన విజయం... అనకాపల్లి హాకీకి గర్వకారణం"
Breaking News

Subscribe our Newsletter