అక్రమ అరెస్టులను ఖండించండి ,సీఐటీయూ

అక్రమ అరెస్టులను ఖండించండి ,సీఐటీయూ

25/April/2026 21:50    Share:   

పయనీర్ ప్రైవేట్ లిమిటెడ్ (అన్రాక్) మాకవరపాలెం కాంట్రాక్ట్ కార్మికుల సమస్య లు పరిష్కరించాలని గత నాలుగు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. వీరికి మద్దతుగా ఉన్న   సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకర్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జి. కోటేశ్వరరావు ,కార్యదర్శి ఏ. రాజు కొంత మంది కార్మికులను ఈరోజు ఉదయం పోలీసులు అరెస్టులు చేసి గొలుగొండ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అత్యంత దుర్మార్గం వెంటనే అరెస్టు చేసిన సిఐటియూ నాయకులను కార్మికులు ను విడుదల చేసి కార్మిక సమస్యలు పరిష్కరించాలని సిఐటియు మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజన్న సత్తిబాబు డిమాండ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాకవరపాలెం మండలం పయనీర్ ప్రైవేట్ లిమిటెడ్ (అన్రాక్) కంపెనీకి భూములు ఇచ్చిన నిర్వాసితులు కార్మికులుగా గత 15 సంవత్సరాలుగా పనులు నిర్వహిస్తున్నారు. కంపెనీలో కార్మికులకు కనీస వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్న పర్మినెంట్ చేయడం లేదు ఎనిమిది గంటలకు మించి పని చేసిన ప్రతీ కార్మికుడికి డబల్ వేతనం ఇవ్వడం లేదని రెండున్నర సంవత్సరాలు దాటిన ప్రతి కాంటాక్ట్ కార్మికుడిని పర్మినెంట్ చేయాలని అనుభవం ఉన్న కార్మికులను అన్ స్కిల్ నుండి సెమి స్కిల్,హై స్కిల్ గా మార్పు చేయాలని ఎనిమిది గంటలు దాటిన ప్రతిగంటకు డబల్ వేతనం చెల్లించాలని కార్మికులందరకు డస్ట్ అలవెన్స్ ప్రతినెల రూ.3000/- చొప్పున ఇవ్వాలని కాంట్రాక్ట్ కార్మికులకు క్యాంటీన్ సౌకర్యం కల్పించి కాంట్రాక్ట్ కార్మికులకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రతి సంవత్సరం బోనస్ , ఈఎస్ఐ కార్డులు, పేస్లిప్లు ఇచ్చి  కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, అరెస్ట్ చేసిన సిఐటియూ నాయకులు కార్మికుల ను విడుదల చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో ధర్మ రెడ్డి అప్పలనాయుడు, దొడ్డు నాగేష్, రెడ్డి ఒనుముల నాయుడు, ఆర్ అప్పలకొండ, సత్యం, శ్రీను తదితరులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter