జీవం ఉన్న పంటలతో 'సబల భోజనాల పండుగ' - ఎపి నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల చలపతి రావు
సింహాచలం:
ప్రకృతి ఆధారంగా పండించే పంటలే ఆరోగ్యానికి, ఆనందానికి మూలమని ఎపి నర్సరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆకుల చలపతి రావు అన్నారు. శుక్రవారం సింహాచలం దేవస్థానం గోశాలలో 'సేవ్' సంస్థ వ్యవస్థాపకులు విజయరాం నేతృత్వంలో నిర్వహించనున్న "సబల భోజనాల పండుగ" గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జన్యుమార్పిడి పంటల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, మన పూర్వీకులు అనుసరించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. జీవం ఉన్న పంటలతో వండిన రుచికరమైన, శుచికరమైన ఆహారాన్ని ప్రజలకు పరిచయం చేయడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రసాయన రహిత ఆహారం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
జీవం ఉన్న పంటలతో సబల భోజనాల పండుగ
- ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం
- ప్రకృతి పంటలే ఆరోగ్యకరం, ఆనంద దాయకం
- జన్యుమార్పిడి పంటలు వద్దే వద్దు
- ఆకుల చలపతి రావు, రాష్ట్ర అధ్యక్షులు, ఎపి నర్సరీ అసోసియేషన్
జీవం ఉన్న పంటలతో సబల భోజనాల పండుగ నిర్వహిస్తున్నామని ఎపి నర్సరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆకుల చలపతి రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం సింహాచలం దేవస్థానానికి చెందిన గోశాల లో "సబల భోజనాల పండుగ" కోసం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరాం నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగుతోంది అన్నారు. ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం అన్నారు. ప్రధానంగా ప్రకృతి పంటలే ఆరోగ్యకరం, ఆనంద దాయకం అని వివరించారు. అలాంటి జీవం ఉన్న పంటలతో మన పూర్వీకులు వంటలు ఎలా చేసుకున్నారో అలాంటి రుచి కరమైన, సుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలు వండటం, భుజించడం, అవగాహన కలిగించడం కోసం ఏప్రిల్ 1 నుంచి 5 వ తేదీ వరకూ సభలో భోజనాలు పండుగ నిర్వహించడం జరిగుతోంది అన్నారు.
ఈ కార్యక్రమంలో తులసి నేచురల్స్ సత్యనారాయణ మాట్లాడుతూ సబల భోజనాలు పండుగలలో ఉత్తరాంధ్ర సాంస్కృతిక కళల ప్రదర్శన నిర్వహించడం జరిగుతోంది అన్నారు. అలాగే పాత ఇత్తడి, మట్టి పాత్రలలో వంటడం జరుగుతుంది అని వివరించారు. జన్యుమార్పిడి పంటలు వద్దే వద్దు అన్నారు. మనం మన సాంస్కృతిని, కళలను కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ప్రంట్ అధ్యక్షులు ఎం ఆర్ ఎన్ వర్మ మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టు ఈ సబల భోజనాలు పండుగలలో పాల్గొనాలని, జయప్రదం చేయాలని, విస్తారంగా ప్రచారం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, ప్రకృతి రైతు గుంటూరు జగన్నాద రాజు, మేంగొ మేన్ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.