కల్వర్టుపై పలక నిర్మించాలని రామ్‌నగర్ ప్రజల విజ్ఞప్తి
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి : యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని రామ్‌నగర్ 18వ వార్డు, 5వ వీధి ప్రధాన మార్గంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. పాండ్రువాడ రామచంద్ర రావు (బి.డి.ఓ) ఇంటి ముందున్న కల్వర్టుపై పలక విరిగిపోయి పెద్ద గుంత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రమాదకరంగా మారిన ప్రధాన రహదారి:ఈ రహదారి గుండా నిరంతరం ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ గుంత సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే వేసవి సెలవుల్లో సైకిళ్లు తొక్కుతున్న చిన్నపిల్లలు ప్రమాదానికి గురై గాయపడినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించాలి:ఒకవేళ ఎవరైనా అదుపుతప్పి ఆ గుంతలో పడితే ప్రాణాపాయం సంభవించే ముప్పు ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, విరిగిపోయిన పలక స్థానంలో కొత్తది నిర్మించి ప్రయాణికుల భద్రతను కాపాడాలని రామ్‌నగర్ ప్రజలు కోరుతున్నారు.