దళిత రైతులు సమస్య పై రాంబిల్లి తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన !
16/March/2026 19:22
Share:
రాంబిల్లి మండలం, తహసీల్దార్ కార్యాలయం వద్ద, పంచదారల దళిత రైతులు తమ న్యాయమైన సమస్య పరిష్కరించాలని, నిరసన వ్యక్తం చేసి, ఎమ్మార్వో శ్రీనివాస్ గారికి, తమ డి పట్టా భూములు తీసుకోరాదని వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు, విధసం( విస్తృత దళిత సంఘాల) ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు, ఐడి బాబు, గోడు వెంకట్రావు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి, జి దేవుడు నాయుడు మాట్లాడారు. పంచదారల దళిత రైతులకు, ఈ భూములు తప్ప మరే భూములు లేవని, గత 50 సంవత్సరాలుగా ఈ డి పట్టా భూములు మీద ఆధారపడి జీవిస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ భూములు పైన పొందుతున్నారని, వాణిజ్య బ్యాంకుల్లో అప్పులు తీసుకొని కుటుంబ అవసరాలు కూడా తీర్చుకుంటున్నారని, ఒక్కొక్క రైతుకు రెండు ఎకరాల 78 సెంట్లు చొప్పున ప్రభుత్వం 1978లో ఇచ్చినటువంటి సుమారుగా 44 ఎకరాల భూమిలో, జీడి మామిడి, యూక్లిప్టస్, కొబ్బరి, అరటి వంటి చెట్లు పెంచుకొని, వచ్చిన పంట పల సాయంతో, కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం అవసరాల రీత్యా, ఈ భూములే తీసుకోవాలని ఆలోచన ఉన్నట్లయితే, దళిత రైతులకు అన్యాయం చేయొద్దని, వారి పొట్ట కొట్టి, రోడ్డుమీదకు నెట్టెయ్యవద్దని ప్రజా సంఘాల నేతలు ఎమ్మార్వో గారిని విజ్ఞప్తి చేశారు. పంచదారల దళిత రైతులను ఆదుకోవాలని, తమరు ఇచ్చినటువంటి ఆర్డర్ ను వెనక్కి తీసుకోవాలని, ఈ ఆర్డర్ పై జిల్లా ఉన్నతాధికారులను కూడా కలుస్తామని, వీరికి న్యాయం జరిగేంత వరకు, మా పోరాటాన్ని ఎంతవరకైనా చేస్తామని తహసిల్దార్ గారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. పంచదారల దళిత రైతులకు న్యాయం చేయాలని, 42వ రోజు రాంబిల్లి తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన