కార్యకర్తల కోలాహలం మధ్య కేక్ కట్ చేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రయ్య దొర
07/April/2026 06:40
Share:
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి : యలమంచిలి వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్‌సిపి పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ, మాజీ జడ్పిటిసి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొద్దప్పు ఎర్రయ్య దొర జన్మదిన వేడుకలు కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ నాయకుల సమక్షంలో ఎర్రయ్య దొర కేక్ కట్ చేసి, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గుప్త, బెజవాడ నాగేశ్వరరావు, కౌన్సిలర్లు దాసరి కుమార్, కొటార్ కొండబాబు, డాక్టర్ పిల్లా త్రినాథ్, దాసరి గణేష్, గోపి, దూది నరసింహమూర్తి, ఏబీఎల్ రాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.జన్మదిన వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన జన్మదిన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి బొద్దప్పు ఎర్రయ్య దొర పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.