టీబీ ముక్త భారత్ కార్యక్రమం నిర్వహణ క్రైమ్ అనాల్సిస్, టివిఎస్ ప్రకాష్, యలమంచిలి : యలమంచిలి మండలం కృష్ణాపురం గ్రామంలోని సచివాలయంలో శనివారం “టీబీ ముక్త భారత్” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఉచితంగా ఎక్స్-రే పరీక్షలు నిర్వహించారు.యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో జనసేన కోర్ కమిటీ సభ్యులు కొలగాని భాస్కర్ రావు, డాక్టర్ రోహిణి, టీబీ సూపర్వైజర్ సత్యనారాయణ, హెల్త్ సూపర్వైజర్ మాణిక్యం, ఏఎన్ఎం మెరిసి, ఆశా వర్కర్స్ కూటమి నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా టీబీ వ్యాధి నివారణపై అవగాహన కల్పిస్తూ, ముందస్తు పరీక్షల ప్రాధాన్యతను వైద్య సిబ్బంది వివరించారు.