APCNF ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన..

APCNF ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన..

16/June/2026 21:18    Share:   

క్రైమ్ ఎనాలిసిస్ (ప్రతినిధి) కన్నేపల్లి నాగశ్రీనువాస శర్మ
యలమంచిలి మండల పరిధిలో APCNF ప్రాజెక్టు ఆధ్వర్యంలో, అనకాపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ చి. లచ్చన్న ఆధ్వర్యంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, ప్రకృతి వ్యవసాయ శాఖ, వెలుగు శాఖ, ఉపాధి హామీ పథకం (NREGS) సిబ్బంది మరియు మండల నాయకులు పాల్గొన్నారు. గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు రాజాన సూర్య చంద్ర శేషగిరి రావు , మండల జనసేన పార్టీ అధ్యక్షులు అన్నం బాబ్జి గారు, లాలం సోమునాయుడు , కొలగాని భాస్కర్ పాల్గొని కార్యక్రమానికి తమ సహకారం అందించారు.
యలమంచిలి మండలంలోని అన్ని గ్రామాల రైతులకు ప్రకృతి వ్యవసాయాన్ని చేరవేయడం, రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ చి. లచ్చన్న ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత, PMDS వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలు, కషాయ ద్రావణాల తయారీ మరియు వినియోగం, బయో రిసోర్స్ సెంటర్ల పాత్ర మరియు ఉపయోగాల గురించి రైతులకు వివరించారు.అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్య పరిరక్షణతో పాటు భూమి సారవంతం అవుతుందని, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలియజేసి రైతులందరూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో , APCNF సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter