
యలమంచిలి ఎస్.జి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎ)లోని కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ పీఎస్సీ గ్రూప్-2 రాష్ట్రస్థాయి మెగా గ్రాండ్ టెస్ట్ – 2026 బహుమతుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఆఫ్‌లైన్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు మరియు విద్యా సామగ్రి అందజేశారు. రాష్ట్రస్థాయి 1వ ర్యాంకు సాధించిన కర్రి తులసి రూ.3000 నగదు బహుమతి మరియు ఏకలవ్య మెటీరియల్ అందుకున్నారు. 2వ ర్యాంకు సాధించిన గుడుపు నాగ గణేష్ రూ.2000 నగదు బహుమతి పొందగా, 3వ ర్యాంకు సాధించిన టెనకల భావని రూ.1000 నగదు బహుమతి అందుకున్నారు.అదేవిధంగా టాప్ 100 మంది విద్యార్థులకు ఏకలవ్య మెటీరియల్ మరియు గాండీవం కోర్సులు అందజేశారు.కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం, పరీక్షల ద్వారా స్వీయ విశ్లేషణ అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమ కన్వీనర్ డా. అర్జున అప్పారావు విద్యార్థులు నిరంతర ప్రాక్టీస్ టెస్టులు రాస్తూ తమ బలహీనతలను సరిదిద్దుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వి. సత్యనారాయణ, కే. వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.