అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయం పునఃప్రారంభం...

అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయం పునఃప్రారంభం...

09/March/2026 08:02    Share:   

అనకాపల్లి. సుమారు మూడేళ్ల పాటు జరిగిన ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి కావడంతో, ఈరోజు (మార్చి 8) ఆలయాన్ని అత్యంత వైభవంగా పునఃప్రారంభము అయింది, 
క్రైమ్ అనాలసిస్:A. Srinivasa Rao,జిల్లా ఇన్చార్జి.
పునఃప్రతిష్ట ముహూర్తం: మార్చి 8. ఉదయం 10:58 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రాజగోపురంపై పసిడి కలశ ప్రతిష్ట మరియు అమ్మవారి మూలవిరాట్ విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి.కన్నుల పండువగా అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునఃప్రారంభం.. పోటెత్తిన భక్తులు, ప్రముఖులు!
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, అనకాపల్లి ప్రాంతానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రసిద్ధ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునఃప్రారంభోత్సవం అత్యంత ఘనంగా, కన్నుల పండువగా జరిగింది. ఆలయ పునర్నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తి కావడంతో, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భక్తుల దర్శనార్థం ఆలయాన్ని తిరిగి తెరిచారు. దీంతో అనకాపల్లి పట్టణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని పండుగ వాతావరణం నెలకొంది.
వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు:
ఆలయ పునఃప్రతిష్టలో భాగంగా వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, హోమాలు, వేదపారాయణం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రబద్ధంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. చాలా కాలం తర్వాత అమ్మవారి దర్శన భాగ్యం కలగడంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ చారిత్రక ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పునఃప్రతిష్ట, పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ ముగిసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. మూడేళ్ల తర్వాత మూలవిరాట్ దర్శనం కల్పిస్తుండటంతో ఇది చాలా విశేషం.
ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను తదితరుల ఆధ్వర్యంలో హోమాలు, ప్రత్యేక పూజలు, బాలాలయంలో కలశ పూజలు ఘనంగా నిర్వహించారు.పాల్గొన్న ప్రముఖ రాజకీయ నాయకులు.
ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక వేడుకలో రాష్ట్ర స్థాయి ప్రముఖ రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు విశేషంగా పాల్గొన్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, చింతకాయల అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణంరాజు, పల్లా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, మండలి బుద్ధ ప్రసాద్, విష్ణుకుమార్ రాజు, పితాని సత్యనారాయణ, అలాగే అదితి గజపతిరాజు తదితరులు ఈ వేడుకలో పాలుపంచుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
Breaking News

Subscribe our Newsletter