యలమంచిలిలో ఘనంగా పదో తరగతి టాపర్లకు సత్కారం..!

యలమంచిలిలో ఘనంగా పదో తరగతి టాపర్లకు సత్కారం..!

22/May/2026 19:33    Share:   

నగదు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్..!!
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - ఉత్తరాంద్ర జోనల్ ఇంచార్జ్ :
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఘనంగా సత్కరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అత్యధిక మార్కులు సాధించిన 17 మంది విద్యార్థులను ఎంపిక చేసి ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.శుక్రవారం స్థానిక యలమంచిలి జెడ్పీ హైస్కూల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలతో పాటు నగదు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో బాలికలు విశేష ప్రతిభ కనబరచడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు ఇదే పట్టుదలతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీవైఈఓబీ అప్పారావు, ఎంఈఓ-1 సూర్యప్రకాశ్, ఎంఈఓ-2 అరుణ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. సుశీల, జువాలజీ లెక్చరర్ పి. పద్మకుమార్, రాంబిల్లి, అచ్చుతాపురం, మునగపాక ప్రాంతాల హెచ్ఎంలు, ఎంఈఓలు, ఎస్ఎంసి చైర్మన్ ఆడారి ఆదిమూర్తి, ఆడారి కమల, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు వారికి అండగా నిలిచిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను పలువురు అభినందించారు.
Breaking News

Subscribe our Newsletter