డ్వాక్రా మహిళలను  పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష

డ్వాక్రా మహిళలను  పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష

30/June/2026 21:45    Share:   

 స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తుల అమ్మకాలకు 'ప్రత్యేక స్వయం మేళ కార్యక్రమం ద్వారా అమ్మకాలు'  గిరిజన ప్రాంతాలలోని డ్వాక్రా మహిళలకు ప్రత్యేక సాధికార కార్యక్రమం ** అన్ని నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు పూర్తిచేయాలి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ద్వారా చేయూత 26 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలతో రూ.280 కోట్లతో 5200 ఎంఎస్ఎంఈ యూనిట్లకు దరఖాస్తులు జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం జరిగిన జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక  కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో  రూ.280 కోట్లతో 5200 ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించామని,  వీటి ఏర్పాటుద్వారా జిల్లాలోని 26 వేల  మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధిపథంలో నిలిపేందుకు అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాలన్నారు.  వినూత్న పరిశ్రమల ఆలోచనలతో ముందుకు వచ్చే  ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ద్వారా వారి ఆలోచనలకు రూపకల్పన చేసి చేయూత  అందిస్తామన్నారు.  జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు పూర్తిచేయాలన్నారు. దెందులూరు, నూజివీడు నియోజకవర్గాలలో  ఎంఎస్ఎంఈ పార్క్ సంబంధించి భూసేకరణ, తదితర పనులు  త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  జిలాల్లో కోకో సిటీ ఏర్పాటుపై  పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటుచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.   జిలాల్లో 15 పరిశ్రమలకు పెట్టుబడి రాయితీ, వడ్డీ, విద్యుత్, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ, తదితర రాయితీలుగా 4 కోట్ల 96 లక్షల 69 వేల  854 రూపాయలు మంజూరు చేస్తూ సమావేశం తీర్మానించింది. 
డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు 'ప్రత్యేక స్వయం మేళా'
జిల్లాలో ముఖ్యంగా డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రోత్సహించాలన్నారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్ ఇమేజ్ కలిగి, ఆన్లైన్ అమ్మకాలు జరిగేలా  చర్యలు తీసుకోవాలన్నారు.  గిరిజన ప్రాంతాలలోని  స్వయం సహాయక సంఘాలు మహిళలకు ప్రభుత్వం అందించే పధకాలను గురించి అవగాహన కలిగించాలన్నారు.  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆర్గానిక్ ఉత్పత్తులు చేసేలా ప్రోత్సహించాలని, వాటికి మార్కెటింగ్ సౌకర్యాలకు రైతు ఉత్పత్తులకు నిర్వహించిన 'రైతు సంపద' వంటి కార్యక్రమాన్ని 'స్వయం మేళా' వంటి కార్యక్రమాన్ని నిర్వహించి డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా నిర్వహించాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్. వెంకటరావు, డిఆర్డిఏ పీడీ విజయలక్ష్మి,  పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్ మేనేజర్ బాబ్జి, ట్రాన్స్కో ఎస్ఈ బి.ఎం. అంబేద్కర్ , వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా,  స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జితేంద్ర, కార్మిక శాఖ సహాయ కమీషనర్ నాగేశ్వరరావు, మత్స్య శాఖాధికారి రాజ్ కుమార్ , గ్రౌండు వాటరు డిడి   కోదండరామ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter