క్రూడ్ ఆయిల్ షాక్: $100 దాటిన బారెల్ ధర,,,

క్రూడ్ ఆయిల్ షాక్: $100 దాటిన బారెల్ ధర,,,

13/April/2026 13:56    Share:   

అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చమురు సెగలు రేపుతున్నాయి. ఇరాన్ రేవులపై అమెరికా నౌకాదళం దిగ్బంధం (Blockade) విధిస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సోమవారం నాడు $100 మార్కును దాటేశాయి.
పాకిస్తాన్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నౌకాశ్రయాలను దిగ్బంధించాలని ఆదేశించారు. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 8% పెరిగి $102.80 కు చేరగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర $104.97 వద్ద ట్రేడవుతోంది.ప్రస్తుతం అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) దళాలు సోమవారం ఉదయం నుంచే ఇరాన్ రేవులకు వెళ్లే నౌకలను అడ్డుకోవడం ప్రారంభించాయి. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, ముడి చమురు ధర $150 వరకు వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Breaking News

Subscribe our Newsletter