*" ఎబోలా అలర్ట్...  భయం వద్దు, జాగ్రత్తలు ముద్దు ... స్వీయ నియంత్రణనే రక్ష.....*

*" ఎబోలా అలర్ట్... భయం వద్దు, జాగ్రత్తలు ముద్దు ... స్వీయ నియంత్రణనే రక్ష.....*

12/June/2026 17:17    Share:   

*" ఎబోలా అలర్ట్... భయం వద్దు, జాగ్రత్తలు ముద్దు ... స్వీయ నియంత్రణనే రక్ష.....* కాంగో, ఉగాండా వంటి ఆఫ్రికా దేశాల్లో వణికిస్తున్న ఎబోలా ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల్లో ప్రయాణించినా... లేదా ఆ దేశాల మీదుగా వచ్చినా.. స్వీయ నియంత్రణలోకి వెళ్లాలని సూచించింది. భారత్ లో ఇప్పటివరకు ఎబోలో కేసులు ఏవీ నిర్ధారణ కానప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. మనకు రాదులే అనే నిర్లక్ష్యం వీడి జాగ్రత్తలు తీసుకోవటం కీలకమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే పుకార్లు నమ్మకుండా.. ప్రభుత్వ సూచనలు పాటించడం అవసరమని చెబుతున్నారు. భయాన్ని వీడి..జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎబోలా ముప్పు నుంచి తప్పించుకోవచ్చని భరోసా ఇస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళటం మంచిదని సూచిస్తున్నారు. ఇటీవల సుడాన్ నుండి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరికి లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎబోలా పట్ల అలర్ట్ అయ్యారు. ఎబోలా లక్షణాలు పసిగట్టడం, దాదాపు 21 రోజులు స్వీయ నియంత్రణలోకి వెళ్ళటం మంచిదని చెబుతున్నారు. కల్లోలం సృష్టించిన కరోనా వైరస్ ను ఎదుర్కోవడం ద్వారా ఎన్నో అనుభవాలను, సంసిద్ధతను మన దేశం తెలుసుకుంది. ఎబోలా పట్ల భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యం. పరిశుభ్రత చర్యలు పాటించడం, రోజుకి నాలుగు సార్లు శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. మాంసాహారులు బాగా ఉడికించి తినడం శ్రేయస్కరం. ఈ నేపథ్యంలో ఎబోలా పట్ల అవగాహనకు, లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఎబోలా "బుండిబుగ్యో" వైరస్ కోసం వైద్య సేవలు అందించేందుకు అవసరమైతే ప్రతి జిల్లాలో ఎబోలా అత్యవసర వార్డును కూడా ఏర్పాటు చేస్తే మంచిదేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భయం వద్దు - జాగ్రత్తలే ముద్దు అనే భావనతో ముందుకు సాగాలి.
....*ఎబోలా ను ఎదుర్కోవడం ఎలా?* ఎబోలా వ్యాధి అనేది మానవులలో వచ్చే ఒక తీవ్రమైన, ప్రాణాంతకమైన అనారోగ్యం.
మూడు వేర్వేరు వైరస్‌లు పెద్ద ఎత్తున ఎబోలా వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఇవి ఎబోలా వైరస్, సుడాన్ వైరస్, బుండిబుగ్యో వైరస్.
ఎబోలా వ్యాధిలో సగటు మరణాల రేటు సుమారు 50శాతంగా ఉంది. గత వ్యాప్తిలలో మరణాల రేట్లు 25–90శాతం మధ్య మారుతూ వచ్చాయి.
ఆమోదించబడిన టీకాలు, చికిత్సలు కేవలం ఒక వైరస్ (ఎబోలా వైరస్)కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన బుండిబుగ్యో వైరస్ తదితర వాటికి మందులు అభివృద్ధి దశలో ఉన్నాయి.
 *వ్యాప్తి నియంత్రణ ఎలా?* వ్యాప్తి నియంత్రణ అనేది రోగులకు అందించే సహాయక సంరక్షణ, సంక్రమణ నివారణ, నియంత్రణ, వ్యాధి పట్ల నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్, ప్రయోగశాల సేవలు, సురక్షితమైన, గౌరవప్రదమైన అంత్యక్రియలు, అవసరమైతే టీకాలు వేయడం, వంటి అనేక చర్యలపై ఆధారపడి ఉంటుంది.
ఎబోలా వ్యాధి అనేది ఫిలోవిరిడే కుటుంబంలోని ఆర్థోఎబోలావైరస్ జాతికి చెందిన వైరస్‌ల వల్ల వస్తుంది. ఇప్పటివరకు ఆరు రకాల ఆర్థోఎబోలావైరస్‌ను గుర్తించారు. వీటిలో మూడు పెద్ద వ్యాప్తికి కారణమవుతాయని తెలిసింది.
ఎబోలా వైరస్ వ్యాధి (ఈవిడి )కి కారణమయ్యే ఎబోలా వైరస్ (ఈ బిఓవి ),
సుడాన్ వైరస్ వ్యాధి (ఎస్ వి డి )కి కారణమయ్యే సుడాన్ వైరస్ (ఎస్ యుడి వి ),
బుండిబుగ్యో వైరస్ (బీడీబీవీ ) కారణమవుతుంది బుండి బుగ్యో వైరస్ వ్యాధి (బీవీడీ )కి. 
ఎబోలా వ్యాధి మొదటిసారిగా 1976లో రెండు ఏకకాల వ్యాప్తిలలో సంభవించింది. ప్రస్తుత దక్షిణ సూడాన్‌లోని నజారాలో సూడాన్ వైరస్ వ్యాధి కాగా, రెండవ వ్యాప్తి ప్రస్తుత డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని యంబుకులో బుండిబుగ్యో వైరస్ జరిగింది. ఈ రెండవ వ్యాప్తి ఎబోలా నదికి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో సంభవించింది, ఆ నది పేరు మీదుగానే ఈ వ్యాధికి ఆ పేరు వచ్చింది.
 
ఎబోలా కొన్ని వైరస్ లకు టీకాలు, చికిత్సలు ఉన్నప్పటికీ, ఎస్ వి డి లేదా బీవీడీ నేటి బుండిబుగ్యో వైరస్ వంటి ఎబోలా వ్యాధులకు ఆమోదించబడిన టీకా లేదా చికిత్స ఏదీ లేదు. ప్రతిపాదిత మందుల ఉత్పత్తులు అభివృద్ధి దశలో ఉన్నాయి.
*ఒకరి నుండి ఒకరికి వ్యాధి ప్రబలడం*
టెరోపోడిడే కుటుంబానికి చెందిన పండ్ల గబ్బిలాలు ఆర్థోఎబోలావైరస్‌కు సహజ ఆతిథేయ జీవులని భావిస్తున్నారు . అనారోగ్యంతో లేదా చనిపోయి ఉన్న లేదా వర్షారణ్యాలలో కనిపించే పండ్ల గబ్బిలాలు, చింపాంజీలు, గొరిల్లాలు, కోతులు, అడవి జింకలు లేదా ముళ్ళపందులు వంటి సోకిన జంతువుల రక్తం, స్రావాలు, అవయవాలు లేదా ఇతర శరీర ద్రవాలతో ప్రజలు దగ్గర గా ఉన్నప్పుడు ఈ వైరస్ మానవ జనాభాలోకి ప్రవేశించగలదు. అడవిలో ఉండే పెద్ద గబ్బిలాలు ఎబోలా వైరస్ కు మూలం. అవి కొరికిన పండ్లు తిన్నా.. గబ్బిలాలను వేటాడి మాంసాహారంగా తిన్నా ఎబోలా వస్తుంది. ఆఫ్రికాలో ఇలానే మొదలైంది.
గాయపడిన చర్మం లేదా శ్లేష్మ పొరల ద్వారా ప్రత్యక్ష సంపర్కం వల్ల ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఈ వైరస్ సోకవచ్చు అని వైద్య నిపుణులు చెపుతున్నారు. బుండిబుగ్యో వైరస్ అయితే రక్తంలో వైరస్ ఉన్నంత కాలం వారు ఇతరులకు వ్యాధిని అంటించగలరు.
 
ఎబోలా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నప్పుడు ఆరోగ్య, సంరక్షణ సిబ్బంది తరచుగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అంటువ్యాధి నివారణ జాగ్రత్తలను కఠినంగా పాటించనప్పుడు, రోగులతో సన్నిహితంగా ఉండటం ద్వారా ఇది సంభవిస్తుంది.
బుండిబుగ్యో వైరస్ తో 
మరణించిన వ్యక్తి మృతదేహంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న, ఖనన కార్యక్రమాలు చేసిన కూడా ఎబోలా వ్యాధి వ్యాప్తికి దోహదం చేస్తాయి.
సంక్రమణ నుండి లక్షణాలు కనిపించే వరకు ముఖ్యం గా బుండిబుగ్యో వైరస్ కాల వ్యవధి 2 రోజుల నుండి 21 రోజుల వరకు వ్యక్తి వ్యాధి నిరోధక శక్తిని బట్టి రోగం బయటపడుతుంది.
 
*ఎబోలా వ్యాధి లక్షణాలు* ఎబోలా వ్యాధి లక్షణాలు అకస్మాత్తుగా కనిపించవచ్చు.వాటిలో జ్వరం, అలసట, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి ఉంటాయి. వీటి తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, దద్దుర్లు, ఇంకా మూత్రపిండాలు, కాలేయ పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్య, సంరక్షణ సిబ్బంది ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.
 
రక్తస్రావం ఒక సాధారణ లక్షణం అనే భావన ఉన్నప్పటికీ, ఇది అంత తరచుగా జరగదు. వ్యాధి ముదిరిన దశలో సంభవించవచ్చు. కొంతమంది రోగులలో వాంతి, మలంలో రక్తం పడటం, ముక్కు, చిగుళ్ళు నుండి రక్తస్రావంతో సహా అంతర్గత, బాహ్య రక్తస్రావం జరగవచ్చు. సూదులు చర్మాన్ని గుచ్చిన ప్రదేశాలలో కూడా రక్తస్రావం జరగవచ్చు.
*రోగ నిర్ధారణ*
ఎబోలా వ్యాధిని మలేరియా, టైఫాయిడ్ జ్వరం, షిగెల్లోసిస్, మెనింజైటిస్, ఇతర వైరల్ హెమరేజిక్ జ్వరాల వంటి ఇతర అంటు వ్యాధుల నుండి వైద్యపరంగా వేరు చేసి గుర్తించడం కష్టం.ఎందుకంటే వ్యాధి యొక్క ప్రారంభ దశలో లక్షణాలు ఒకేలా ఉంటాయి.
*చికిత్స*
సంవత్సరాలుగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ ), దాని భాగస్వాములు, రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను ఎలా అందించాలి. వారు బ్రతికే అవకాశాలను ఎలా పెంచాలి అనే విషయాలను వివరించే మార్గదర్శకాలను, శిక్షణను అభివృద్ధి చేశాయి. ఇదే ఆప్టిమైజ్డ్ సపోర్టివ్ కేర్ అని పిలువబడింది. రోగిని కోలుకోవడానికి ఉత్తమ మార్గంలో ఉంచే ఇతర విధానాలను కవర్ చేస్తుంది.
ప్రమాద కారకాలపై, వ్యక్తులు తీసుకోగల రక్షణ చర్యలపై అవగాహన పెంచడం మానవ వ్యాప్తిని తగ్గించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం. ప్రమాదాన్ని తగ్గించేందుకు వీలుగా అనేక అంశాలపై దృష్టి పెట్టాలి.
 
 ఎబోలా రోగులతో దగ్గరి శారీరక సంబంధాన్ని నివారించాలి. త్వరితగతిన సంరక్షణ అందించడానికి, ఇంట్లో వ్యాధి వ్యాప్తిని నివారించడానికి, రోగులను నిర్దేశిత చికిత్సా కేంద్రంలో వేరుగా ఉంచాలి.
ప్రజలకు వ్యాధి గురించి, అలాగే దాని వ్యాప్తిని ఎలా నియంత్రించాలో అనే విషయంపై పూర్తి అవగాహన ఉండాలి. 
వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా మరణించిన వారికి సురక్షితమైన, గౌరవప్రదమైన అంత్యక్రియలు మెడికల్ టీమ్ సహాయం తో నిర్వహించడం , ఎబోలా వ్యాధి సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి 21 రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా, ఆరోగ్యవంతులను రోగుల నుండి వేరు చేయడం, వ్యాధి నిర్ధారణ అయిన వారికి సంరక్షణ అందించడం వంటివి ఉన్నాయి. మంచి పరిశుభ్రతను, శుభ్రమైన వాతావరణాన్ని పాటించడం కూడా చాలా ముఖ్యం.
ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ఇన్ఫెక్షన్‌ను నియంత్రించడం
ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, రోగుల వ్యాధి నిర్ధారణతో సంబంధం లేకుండా, వారికి చికిత్స అందించేటప్పుడు ఎల్లప్పుడూ ప్రామాణిక జాగ్రత్తలు తీసుకోవాలి . వీటిలో ప్రాథమిక చేతి పరిశుభ్రత, శ్వాసకోశ పరిశుభ్రత, వ్యక్తిగత రక్షణ పరికరాల వాడకం (వ్యాధి సోకిన పదార్థాల తుంపరలు లేదా ఇతర స్పర్శను నివారించడానికి), సురక్షితమైన ఇంజెక్షన్ పద్ధతులు మరియు సురక్షితమైన, గౌరవప్రదమైన మెడికల్ బృందంచే ఖనన పద్ధతులు ఉన్నాయి.
 
ఎబోలా వ్యాధి ఉన్నట్లు అనుమానిస్తున్న లేదా నిర్ధారించబడిన రోగులకు చికిత్స అందిస్తున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, రోగుల రక్తం, శరీర ద్రవాలతో పాటు, దుస్తులు, పరుపుల వంటి కలుషితమైన ఉపరితలాలు లేదా వస్తువులతో సంబంధాన్ని నివారించడానికి అదనపు అంటువ్యాధి నియంత్రణ చర్యలను పాటించాలి.
*ప్రాణాలతో బయటపడిన వారి సంరక్షణ*
కోలుకున్న వారందరికీ, వారి భాగస్వాములకు, కుటుంబాలకు గౌరవం, మర్యాద, కరుణ చూపించాలి. ఆర్థోఎబోలావైరస్ పరీక్షలో నెగటివ్ వచ్చిన కోలుకున్న రోగులను ఐసోలేషన్‌లో ఉంచవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూ హెచ్ ఓ ) సిఫార్సు చేస్తోంది. కోలుకున్న వారు వైద్యపరమైన, మానసిక పరిణామాల (సీక్వెలే) రెండింటితోనూ బాధపడవచ్చు. ఈ పరిణామాలను తగ్గించడానికి సంరక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం , సమాజంలో తిరిగి కలవడానికి మద్దతు ఇవ్వడం, కౌన్సెలింగ్, బయోలాజికల్ పరీక్షలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రభావిత దేశాలను ప్రోత్సహిస్తోంది... ముఖ్యంగా విదేశాల నుండి వచ్చే వారిపై నిఘా ఉండాలి, అంతర్జాతీయ విమానాశ్రయాలు ట్రాన్సిట్ హాల్టిలో వ్యాది కి గురికావచ్చు, కాని ఎయిర్ పోర్టు లో గంటల్లో వ్యాధి లక్షణాలు కనబడకపోవచ్చు. 21 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఆర్థిక ఇబ్బందుల రిత్యా ముందు జాగ్రత్త పేరుతో విదేశాల నుంచి వచ్చే వారిని 21 రోజులు కోరంటైన్ ( ఎవరిని కలవకుండా ) పెట్టడం సాధ్యం కాదు గడచిన 21 రోజుల్లో వ్యాధి గురి అయినా తెలియక ఇతరులతో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా సహజంగా జీవించడం కూడా వ్యాధి విస్తరణకు మూల కారణం అవుతుంది. మనకు సంబంధం లేకుండా ఎక్కడో దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది కాని ధరల పెరుగుదాలతో మనమందరం ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి వైరస్ పట్ల ఎవరికి వారు ఎప్పటికప్పుడు ఆరోగ్య సంస్థ సూచనలను పాటిస్తూ చాలా అప్రమత్తంగా ఉండాలి. పెద్ద గబ్బిలాలు ఉన్న అటవీ ప్రాంతాలు, పడుపాడిన భవనాలు, గబ్బిలా లు ఉన్న ఏరియాకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత స్వీయ నియంత్రణనే ఆరోగ్య రక్ష.... *డా యం. అర్. యన్. వర్మ. సీనియర్ జర్నలిస్ట్. సెల్ : 9848069524*
Breaking News

Subscribe our Newsletter