కొలంబియాలో భారీ భూకంపం: 47 మంది మృతి, కూలిన భవనాలు..

కొలంబియాలో భారీ భూకంపం: 47 మంది మృతి, కూలిన భవనాలు..

10/August/2026 21:55    Share:   

కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది. ఈ విపత్తు కారణంగా ఇప్పటివరకు 47 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. భూకంప ధాటికి పలు నగరాల్లోని బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లు కుప్పకూలాయి.
శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ భూకంప ప్రకంపనలు పొరుగు దేశమైన ఈక్వెడార్‌లో కూడా తీవ్రంగా వ్యక్తమవడంతో ప్రజలు భయాందోళనలతో రోడ్లపైకి పరుగులు తీశారు.
 
Breaking News

Subscribe our Newsletter