మడుతూరు దళితపేటలో సమస్యలు పరిష్కరించాలి, ప్రజా సంఘాలు

మడుతూరు దళితపేటలో సమస్యలు పరిష్కరించాలి, ప్రజా సంఘాలు

04/August/2026 19:27    Share:   

రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై వివక్షత, సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంఘాలు సర్వేలకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా మడుతూరు గ్రామంలో, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కే సోము నాయుడు పర్యటన చేయడం జరిగింది. గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలపై దళితులు వివరించడం జరిగింది. మడుతూరు దళిత కాలనీలో రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని కొండవీధి, చర్చి వద్ద ఆరు నెలలుగా మంచినీళ్లు రావడంలేదని సైడ్ కాలువలు లేవని ప్రభుత్వం దళితులకు 200 యూనిట్లు లోపు కరెంట్ బిల్లు వస్తే బిల్లు కట్టనవసరం లేదని నిబంధనలు ఉన్న కరెంటు బిల్లులు కట్టాలని ఒత్తిడి తెచ్చి బిల్లుల కట్టిస్తున్నారని గతంలో ఇచ్చిన ఇంటి స్థలాలకి పట్టాలు నేటికీ ఇవ్వలేదని, పింఛన్లు,  స్కీము ఇల్లు మంజూరు చేయాలని ,ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు గ్రామానికి ఖర్చు చేసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. పై సమస్యలు పరిష్కారానికై అధికారులు చర్యలు తీసుకొని మా సమస్యలు పరిష్కరించాలని వాపోయారు. ఈ కార్యక్రమంలో మునగపాక అప్పలరాజు, కట్ట నూకమ్మ, గుర్రాల సూరిబాబు, నాగేశ్వరరావు, సుధాకర్, ఇరుగుల లక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter