సామాజిక అభివృద్ధిలో మీడియా కీలకపాత్ర పోషించాలి,ఎమ్మెల్యే విజయ్ కుమార్.

సామాజిక అభివృద్ధిలో మీడియా కీలకపాత్ర పోషించాలి,ఎమ్మెల్యే విజయ్ కుమార్.

07/September/2026 07:54    Share:   

యలమంచిలి : సమాజ అభివృద్ధిలో మీడియా కీలకమైన పాత్ర పోషించాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం అచ్యుతాపురంలో యలమంచిలి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా (ఏపీఈఎంజేఏ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దే ఫోర్త్ ఎస్టేట్ గా బాధ్యత పోషిస్తుందన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసే విధంగా పత్రికలు ముందుండాలన్నారు. మారుతున్న కాలానుగుణంగా విలేకరులు వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాలని అన్నారు. విలేకరులు వృత్తి నైపుణ్యతను పెంపొందించేందుకు అవసరమైన విధంగా శిక్షణా తరగతులకు తన వంతు ప్రోత్సాహం చేస్తానన్నారు. మీడియా సంఘం నిబద్ధతతో ముందుకు సాగాలన్నారు. యలమంచిలిలో ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటుకు స్థలం మంజూరు చేస్తానన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి విలేకరులకు ఇళ్ల స్థలాల మంజూరు చేస్తానన్నారు. అంతకుముందు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు రుద్ర చిట్టిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు లు సంఘ అభివృద్ధికి సమన్వయం చేసుకొని ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిషోర్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రరావు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే నిబద్ధతతో విలేకరుల సంక్షేమానికి అనునిత్యం పోరాడుతుందన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ఎల్వీ స్వామి మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నేతల దృష్టికి ఇప్పటికే తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. యలమంచిలి నియోజకవర్గంలో విలేకరులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహం అందించాలన్నారు విలేకరుల శిక్షణా తరగతులకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఎమ్మెల్యే గతంలో హామీ ఇచ్చారని ఆయన హామీనే మనమంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఎలక్ట్రానిక్ మీడియా యలమంచిలి ప్రెస్ క్లబ్ (ఏపీ ఈఎంజేఏ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు గా పల్ల రాజబాబు (సాక్షి ), రమణ (టీవీ5), సుబ్బరాజు (ఈటీవీ), అధ్యక్షునిగా కిషోర్, ప్రధాన కార్యదర్శిగా రామనాయుడు, సహాయ కార్యదర్శిగా చంద్రమౌళి సంతోష్, రమణారావు, రామకృష్ణ, కార్యవర్గ ప్రతినిధులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ప్రతినిధులు ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సహచర సభ్యులు సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ హాయ్ సత్యనారాయణ, ప్రత్యేక ప్రతినిధి మూర్తి, ఏపీ యుడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి శ్రీమాన్ తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter