జిల్లాస్థాయిలో సమీక్ష చేయాలి ఆర్టీఐపై ప్రజా ప్రయోజనాల అంశాలపై జిల్లా కలెక్టర్ కు లేఖ..! ఉద్యమకర్త బొడ్డేడ జగ్గఅప్పారావు
గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి,ప్రజలకు సకాలంలో సమాచారం అందేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి,పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి, ఆర్టీఐ అమలును పర్యవేక్షించాలి,అనకాపల్లి: సమాచార హక్కు చట్టం–2005 (ఆర్టీఐ) సమర్థవంతమైన అమలుకు జిల్లా కలెక్టర్ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాలని సామాజికవేత్త, సమాచార హక్కు చట్టం ఉద్యమకర్త బొడ్డేడ జగ్గఅప్పారావు కోరారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టీఐ అమలుపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించాలి.ఆర్టీఐ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి.
పెండింగ్‌లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలి.గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీఐపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
ప్రజలకు దరఖాస్తు విధానం, అప్పీల్ విధానం తదితర అంశాలపై సదస్సులు నిర్వహించాలి.ప్రతి ప్రభుత్వ శాఖలో ఆర్టీఐ నిబంధనలపై అధికారులకు అవగాహన కల్పించాలి.ప్రజలకు అవసరమైన సమాచారాన్ని పారదర్శకంగా అందించి ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం పెంచాలి.ఆర్టీఐ చట్టం అమలును జిల్లా స్థాయిలో నిరంతరం పర్యవేక్షించే విధానం ఏర్పాటు చేయాలి కోరారు..