అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు!తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం  

అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు!తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం  

04/August/2026 12:37    Share:   

క్రైమ్ఎనాలసిస్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్
ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుకు తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే అందించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, తల్లి–బిడ్డ ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయని అధికారులు వివరించారు.
కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ జి. అపరంజిని, సీహెచ్‌ఓ కృష్ణవేణి, మహిళా పోలీసు శైలజ, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యవంతంగా ఎదుగుతాడని, ప్రతి తల్లి తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి పిల్లలకు తప్పనిసరిగా అందించాలని వారు సూచించారు
Breaking News

Subscribe our Newsletter